Wednesday, December 16, 2015

Press release 16-12-15.......

Press note- DGP Congratulated the police sports winners. 

ప్రెస్ రిలీజ్



క్రీడల్లో మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలి ..... గెలుపొందిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన డి.జి.పి అనురాగ్ శర్మ
తేది 16 డిసెంబర్, 2015
ఈ నెల 7 నుండి 13 వరకు హరియానా రాస్త్ట్రం మధుబన్ లో జరిగిన 64 వ జాతీయ పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్ చాంపియన్ షిప్ పోటీలలో  తెలంగాణా రాష్ట్ర పోలీసులు విజయాలను సాధించారు.  బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు (WUSHU)  పోటీలలో తెలంగాణా రాస్త్ర పోలీస్ జట్లు పాల్గొన్నాయి.  వరంగల్ రూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన కే.లీల (WPC 06)  కు సిల్వర్,  బాక్సింగ్ లో చార్మినార్ పోలీస్ స్టేషన్ కు చెందిన జైనాబ్ ఫాతీమా (WPC 6319)  ఉషు పోటీల్లో శాహినాథ్ గంజ్ పీ.ఎస్. కు చెందిన కానిస్టేబుల్ కనక లక్ష్మి (WPC 5460) చార్మినార్ పే.ఎస్ కు చెందిన ఎం. వినోద కుమార్ (PC 3719)  కాంస్యం మెడల్స్ గెల్చుకున్నారు.  విజేతలుగా బహుమతులు అందుకుని ఈ రోజే నగరానికి వచ్చిన వీరు ఐ.జి.పి బెటాలియన్స్ శ్రీనివాస రావు అధ్వర్యంలో రాస్త్ర డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీసు శ్రీ అనురాగ్ శర్మ ను కలిసారు. విజేతలoదరికి  డి.జి.పి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణా పోలీస్ క్రీడాకారులు తమ సత్తా చాటాలని, జాతీయ స్థాయిలో జరిగే అని పోటీల్లో పాల్గొని మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని అన్నారు.  అలాగే, గత వారం హైదరాబాదులో జరిగిన బాడీ బిల్డింగు పోటీల్లో  మిస్టర్ తెలంగాణా గా 90 కిలోల విభాగంలో నగరం లో పనిచేస్తున్న అరుణ్ కుమార్ (PC 577)   మూడవ స్థానం లో నిలవగా,8 వ బెటాలియన్ లో పనిచేస్తున్న ఎస్కే, రఫీ (PC 1827)  100 కిలోల విభాగంలో మూడవ స్థానం లో నిలిచారు.  
ఈ నెల 11 నుండి 14 వరకు వరంగల్ జిల్లా కేసముద్రంలో  జరిగిన బాస్కెట్ బాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ పోటీల్లో తెలంగాణా పోలీస్ శాఖ  కస్టమ్స్ డిపార్టమెంట్ ను ఓడించి  రెండవ స్థానంలో నిలిచారు.    ఈ సందర్భంగా విజేతలందరూ డి.జి.పి ని కలిసి అభినందనలు అందుకున్నారు.  క్రీడాకారుల వెంట స్పోర్ట్స్ గైడ్ అర్జున అవార్డ్ గ్రహీత జయరాం ఉన్నారు.

సి.పి.ఆర్.ఓ
డి.జి.పి కార్యాలయం

No comments:

Post a Comment