Home Minister attended training camp Regarding "Occupational Health and
Safety in Stone Crushing operations and Silica Sand Manipulation"
organised by Department of Factories @ FTAPCCI Building, Redhills,Hyd
today.
గౌరవ హోం శాఖా మంత్రి గారి ఉపన్యాసం
స్టోన్ క్రషింగ్ ఆపరేషన్స్ మరియు సిలికా సాండ్ మానిపులేషన్ కంపెనీలలో వృత్తిపరమైన వ్యాధులు మరియు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు గురించి శిక్షణా కార్యక్రమాలు
స్థలం: ఫ్యాప్సి ఆడిటోరియం , ఫెడరేషన్ హౌస్, రెడ్ హిల్స్,
హైదరాబాద్ , సమయం : ఉదయం: 10 గంటలకు
హైదరాబాద్ , సమయం : ఉదయం: 10 గంటలకు
- తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఐదు వందల ఎనబై ఐదు (585) ఫ్యాక్టరీలు సిలికా (ఇసుక) ఉపయోగించుకొని పనిచేస్తున్నాయి.
- ముఖ్యంగా స్టోన్ క్రషింగ్ యూనిట్ లు , గ్లాస్ తయారీ యూనిట్ లు, సాండ్ బ్లాస్టింగ్ యూనిట్ లు , గ్రాఫైట్ పౌడర్ యూనిట్ లు, కుండల తయారీ యూనిట్ లు , రిఫ్రాక్టరీ బ్రిక్స్ తయారీ యూనిట్ లు, ఫౌండ్రీస్, రెడీ మిక్స్ కాంక్రీట్ యూనిట్ లు ఈ సిలికా (ఇసుక ) ను ఉపయోగిస్తున్నాయి.
- ఇవి ఎక్కువగా స్టోన్ క్వారీలకు ప్రక్కన గాని లేదా క్వారీలలో గాని ఉంటున్నాయి.
- ఈ సిలికా (ఇసుక ) ఉపయోగం వలన “సిలికాసిస్ “ అనే వ్యాది వచ్చే ప్రమాదం వుంది. ఇది దీర్ఘకాలికంగా బాదిస్తుంది.
- దీనికి అదనంగా ఇతర పరిశ్రమలు “ఫెల్డ్ స్పార్ “ ను మరియు కొన్ని “రెడీ మిక్స్ కాంక్రీట్ యూనిట్ లు” ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సిలికా (ఇసుక ) ను ఉపయోగిస్తున్నాయి.
(దయచేసి పేజి 2 చూడండి ...)
-2-
- ఇవన్ని కూడా దుమ్ము , దూళితో కూడి ప్రమాదకరమైనవి.
- అయితే ఈ దుమ్ము, ధూళిని ని నియంత్రించకపోయిన, కార్మికులకు అవగాహన కల్పించకపోయిన, రక్షణ చర్యలు తీసుకోకపోయినా శ్వాశకోశ వ్యాదులు మరియు దీర్ఘకాలిక “సిలికాసిస్ “ వంటి వ్యాదుల బారిన పడవలసి వస్తుంది.
- ఫ్యాక్టరీల చట్టం మరియు రూల్స్ ప్రకారం ప్రమాదకర పరిస్థితులలో పనిచేసే కార్మికుల కొరకు రక్షణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు, మెడికల్ సౌకర్యాలు , మెడికల్ పరీక్షలు చేపట్టవలసిన బాద్యత యాజమాన్యానికి వుంది.
- ఈ రోజు ఫ్యాక్టరీస్ డిపార్టుమెంటు వారు ప్రమాదకరమైన సిలికా తో కూడిన ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల వృత్తిపరమైన వ్యాదులు మరియు తీసుకోవలసిన రక్షణ చర్యల గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
- అంతే కాకుండా ఈ అంశంలో పూర్తి స్థాయి అవగాహన కలిగిన స్పెషలిస్ట్ లను యజామాన్యాలు నియమించుకొని కార్మికులకు అవగాహన కల్పిస్తూ వారిని ఆరోగ్య సమస్యల నుండి కాపాడాల్సిన అవసరం ఎంతైనా వుంది.
No comments:
Post a Comment